బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం
బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది.  తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట చాల చాలా ప్రధానమైన విషయం.

మారుతున్న కాలంలో ఆడువారు ఉద్యోగస్తులుగా చక్కగా రాణిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం కూడా బాలికలకు చదువు అవసరం ఉంది.

చదువుకున్న ఇల్లాలు వలన ఇంట్లో పిల్లలు బాగుగా చదవగలరు . ఇంకా విద్య యొక్క ఆవశ్యకత ను తల్లి ముందుగానే పిల్లల్లో ఏర్పరచగలదు . మనదేశం లో ఎక్కువ మంది నాయకులు తల్లుల బోధ వలననే మంచి ఆశయం కోసం కృషి చేసారని అంటారు.

కాబట్టి మంచి సమాజం భవిష్యత్తు మంచి అమ్మ దగ్గర పెరిగే బిడ్డల బట్టి ఆధారపడి ఉంటె, అటువంటి అమ్మ బాల్యంలో సరైన చదువుకుని ఉంటె, కచ్చితంగా మెరుగైన సమాజం కోసం రేపటి పౌరులు అమ్మ ఒడిలోనే పాఠాలు నేర్చుకునే అవకాశం బాలికల చదువు పైనే ఆధారపడి ఉంటుంది.

మహిళలు కేవలం ఉద్యోగస్థులుగానే కాకుండా అనేక రంగాలలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు . క్రీడారంగం , రాజకీయ రంగం, సినిమా రంగం  వంటి పలు రంగాలలో ఆడువారి పనితీరు అద్భుతంగా ఉంటుంది.

వివిధ రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాధించిన ఆడువారు, ఆలా నేటి బాలికలకు ఆదర్శంగా నిలిచే మహిళల అక్షరాస్యత, ఆసియాలోకే అతి తక్కువగా భారత దేశంలోనే ఉంది.

నేటికి 20 కోట్ల మంది మహిళలు నిరక్ష్య రాస్యులుగా ఉన్నట్టు అంచనా ఉంది. దీనిని బట్టి చూస్తే బాలికలకు అవసరం  విద్య అనేది గతంలో తక్కువగా ఉందని అర్ధం అవుతుంది. స్త్రీలు కూడా మంచి విద్యను అభ్యసిస్తే, వారి ద్వారా పిల్లలకు మంచి విద్య అందే అవకాశం ఉంటుంది. కాబట్టి బాలికలకు  విద్య అంటే తెలిసి ఉండడం, విషయ పరిజ్ఞానం వలన విషయాలపై అవగాహన ఉంటుంది. అలాగే అనేక విషయాలలో ఆగవగాహన వలన అపోహలకు  తావు ఉండదు.

అపోహలు లేనప్పుడు మనో భయాలు తక్కువగా ఉంటాయి. నిరక్ష్యరాస్యులు  అయిన స్త్రీలు గర్భస్థ సమయంలో ఇబ్బందులు  పలు అయ్యే అవకాశం ఉంటుందని  అంటారు.

కానీ చదువుకున్న మహిళలకు వారి వారి విషయాలపై కూడా తగినంత అవగాహనా ఉంటుంది. కాబట్టి బాలికలకు విద్య నేటి సమాజంలో చాల అవసరం ఉంది.

TeluguloVyasalu

TeluguReads

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం