రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం యొక్క చరిత్ర… Continue reading రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి. మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు. నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం… Continue reading కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం. సమాజంలో అంటువ్యాధులు ప్రభలితే, వాటి ప్రభావం అందరి ఆరోగ్యంపైనా పడుతుంది. దీని గురించి అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం. అంటువ్యాధి అంటేనే ఒకరి నుండి మరొకరికి పాకే గుణం కలిగి ఉంటుంది. సహజమైన వాతావరణంలో మనిషి సహజంగా తోటివారితో కలిగి జీవిస్తాడు. తద్ఫలితంగా అంటువ్యాధి వ్యాప్తి చెంది, నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ. మనిషి సంఘజీవి, సమాజంలో కొందరితో కలిసి జీవించే మనిషి తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుని… Continue reading అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం. నేటి బాలికలే రేపటి తల్లులు మారతారు . గృహిణిగా ఇంటి బాధ్యతలు చక్క పెట్టె, అమ్మ పిల్లలకు మొదటి గురువు గా ఉంటుంది.  తల్లి దగ్గర నేర్చిన పాఠం జీవితంలో ఎప్పటికి గుర్తు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి తన పిల్లలకు విద్యను నేర్పించడానికి, ఆమె బాల్యం లో చదువుకుని ఉండుట చాల చాలా ప్రధానమైన విషయం. మారుతున్న కాలంలో ఆడువారు ఉద్యోగస్తులుగా చక్కగా రాణిస్తున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం… Continue reading బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం. విద్య వలన వ్యక్తి బుద్ది వికసిస్తుంది. విద్య పలురకాలు… అయితే ప్రాధమికంగా శాస్త్రీయ విద్యతో విద్యార్ధి దశ ప్రారంభం అయితే, అటువంటి విద్య అన్ లైన్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా నేర్చుకోవచ్చు. నేటి విద్యా వ్యవస్థ సాంకేతికత తోడై సులభతరంగా మారుతుంది. నేర్చుకునే ఉత్సాహం ఉండాలే కానీ ఎవరైనా విద్య నేరుకునే విధంగా విద్యావ్యవస్థ మారుతుంది. ఇంటర్నెట్ ఆధారిత పరికరాల వాడుక పెరిగాక, ఆన్ లైన్ విద్యకు ప్రాముఖ్యత పెరిగింది. నేటి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకంగా విద్య అందరికి అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు విద్య నేర్చుకోవడానికి విద్యాలయానికి వెళ్లి, నిర్ణీత సమయాలలో విద్యాభ్యాసం… Continue reading ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది. అలాంటి సుగుణాభిరాముడి గురించి… Continue reading రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం , మితి మీరిన సెల్ ఫోన్ వాడకం మనిషికి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అంచనాలు. ఇంకా సమాజంలోసెల్ ఫోన్ అతిగా వాడడం మొబైల్ వాడడం వలన నష్టాలు వివరిస్తూ అనేకమంది ఔత్సాహికులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సెల్ ఫోను వాడుక పెరుగుతూనే ఉంది. మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు. మనమద్య సెల్ ఫోన్ రాకముందు సమాజంలో పలకరింపులు బాగుంటే, ఇప్పుడు పలకరింపులు పరిమితమైపోతున్నాయనే భావన బలపడుతుంది. ఇపుడు… Continue reading సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి. గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు. ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది. మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది. భూమి, గాలి,… Continue reading అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుందని మీరు అంగీకరిస్తారా? అవును ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం ఒక నేస్తంలాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తాను ఎందుకు ఒంటరిగా ఉంటే పుస్తకం ఓకే నేస్తం మాదిరిగా ఉంటుందని అంటున్నాను అంటే, పెద్దలు ఇదే మాటను ఎక్కువగా చెబుతారు. పుస్తకం వలన విషయపరిజ్ఞానం పెరుగుతుందని అంటారు. పెద్దలు పలికే పలుకలలో పుస్తకాలు ఎక్కువగా చదవండి… అగవగాహన చేసుకోండి… విషయాలపై ఆలోచన చేయండని చెబుతారు. కావున పెద్దల మాటలను బట్టి చూస్తే, పుస్తకాలు ఒక మంచి మిత్రుడు మాదిరిగా మారతాయి. నా దృష్టిలో నుండి చూస్తే నాకు తెలుగు పుస్తకం తెలుగు నేస్తంలాగా, ఇంగ్లీష్ పుస్తకం ఒక గుడ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. తెలుగు పుస్తకం చదివితే తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది. బాగా తెలుగు తెలిసిన స్నేహితుడి మాటలు తెలుగులో అక్షరాలుగా పదాలు పేరాలలో పేరుకుపొతే అవి ఒక తెలుగు మిత్రుడి మాటలుగా నా మనసులోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు నా స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉంటే పది మంది మిత్రులు ఉన్నట్టే. ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ పుస్తకాలే నాకు మిత్రులు. ఇంకా గ్రంధాయలం నుండి ఎరువు తెచ్చుకునే తాత్కాలిక నేస్తం అప్పుడప్పుడు పలకరిస్తుంది. గ్రంధాలయం నుండి ఒక నాయకుడు చరిత్ర పుస్తకం అయితే ఓ పాతకాలపు నేస్తం నాకు దొరికినట్టే… అలాగే నేటి నాయకుల చరిత్ర అయితే ఓ సోషల్ ఫ్రెండ్ ఉన్నట్టే… ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది.. తరం మారుతుంది తరతరాల సంస్కృతి పుస్తకం వలననే తరం నుండి తరానికి చేరుతుంది… అంటే పుస్తకం ఒక దీర్ఘకాలిక నేస్తమే అవుతుంది… మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. మంచి పుస్తకం కాలంలో ఎంతోమందికి ఓ మంచి నేస్తంగా మారుతుంది. ఎందుకంటే మంచి పుస్తకం అంటే అందరికి మక్కువ ఉంటుంది. కాలంలో కలిసిపోయిన విషయాలను పుస్తకం గుర్తుకు తేగలదు. ఓ మంచి నాయకుడు జీవితం ఒక పుస్తకంగా మారితే, ఆ నాయకుడు కాలం చేసాక కూడా ఆయన జీవితం పుస్తకరూపంలో లోకంలో ఉంటుంది. ఆ పుస్తకం ఎంతోమందికి మంచిమిత్రుడులాగా ఉపయోగపడుతుంది.… Continue reading ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అ అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం ఆ ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు, ఆలుమగలు, ఆలోచన, ఆకరాయి, ఆకారం ఇ ఇల్లు, ఇటుక, ఇనుము, ఇసుక, ఇవతల, ఇంకా, ఇటీవల, ఇంతి,… Continue reading తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో