తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజంపైన పడుతుందా? అవుననే అంటారు. ఎందుకంటే ఒకప్పుడు హిట్ సినిమాను బట్టి, ఆ సినిమా చీరలు అని అమ్మకాలు కొనసాగించేవారు. అంటే పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ అయ్యింది… ఆ తురువాత బట్టల షాపులలో పెళ్ళిసందడి చీరలు అంటే అమ్మకాలు ఎక్కువగా ఉండేవి… అదేవిధంగా తెలుగు సినిమా హీరోల స్టైల్ కూడా యువతపై ప్రభావం చూపుతుంది. మన తెలుగు సినిమాల కధలు సమాజంలో ఎదో ఒక మూల జరిగిన సంఘటన ఆధారంగా లేక రచయిత మైండులో పుట్టిన ఆలోచన ఆధారంగా కావచ్చు. కాని ఆయా తెలుగు సినిమాల ప్రభావం మొత్తం తెలుగు సమాజంపై ఉంటుంది. ఎక్కువ అభిమానులు కలిగిన హీరో సినిమా అయితే, ఎక్కువమంది యువకులపై ప్రభావం చూపుతుంది. ఏమిటి? ఈ తెలుగు సినిమాల ప్రభావం తెలుగు సమాజం పైన… అంటే ఆలోచనా ధోరణిలోకి సినిమాలలో ఉండే విషయాలు వచ్చి చేరతాయి. ఎలాంటి విషయాలు ఆలోచన ధోరణికి దగ్గరవుతాయి? అంటే కధానాయకుడు వేష ధారణ యువకులలో అనుసరించాలనే ఆసక్తిని పెంచవచ్చు. అలాగే కధానాయిక యొక్క వేషధారణ కు యువత మనసులో మెదులుతూ ఉంటుంది. ఇంకా మాటల ప్రభావం కూడా ఉండవచ్చు. అంటే సినిమాలో నాయకా నాయికలు మాట్లాడే భాషా శైలి యువతను ఆకట్టుకుంటే, అటువంటి శైలిని యువత అనుసరించడానికి ఆసక్తి కనబరచవచ్చు. ఇలా తెలుగు సినిమాల వలన వేషధారణ, మాటతీరు తెలుగు సమాజంపై పడే అవకాశం ఉంటే, ఇంకా సినిమా కధలో చేయవచ్చు, చేయకూడదు అనే పనులపైన కూడా సినిమా ప్రభావం ఉండవచ్చు. సమాజంలో ఎదో ఒక ప్రాంతంలో ఏదైనా వింత ప్రవర్తన ఉన్న వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తి కధను సినిమాగా మరల్చడం ద్వారా ఆయా ప్రాంతీయ పోకడ మొత్తం సమాజానికే తెలియబడుతుంది. ఒక దర్శకుడి వినూత్న ఆలోచన సినిమాగా వచ్చినా ఆ ఆలోచన కూడా యువత మైండులో మెదులుతుంది. ఇలా కొందరి ఆలోచనా సృష్టి, సమాజంలో యువతపైన ప్రభావం చూపించే అవకాశం సినిమాల వలన ఎక్కువగా ఉండవచ్చు. తెలుగులో వ్యాసాలు కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి స్నేహం గురించి… Continue reading తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

మనకు అనేక తెలుగు కధలు ఉన్నాయి… అయితే కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి? అంటే, కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని వ్యాక్యాలలో కధ గురించి…. ఈ తెలుగు వ్యాసంలో కధ అంటే ఎదో ఒక సత్యమైన విషయమును తెలియజేస్తూ, కల్పనతో కూడిన వచనం గాని, వాక్కుగా గాని చెబుతారు. పరిణామం ప్రకారం కధలు చిన్న కధలు, పెద్ద కధలు, నవలలు, ఒక పేజి కధలు… అలా కొన్ని రకాలుగా కధలు ఉంటాయి. కధలు చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి అమ్మ చెప్పే కమ్మనైన కధలు ఉంటాయి. ఇలా… Continue reading కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు… ఈ క్రిందిగా… ఈగ – ఇది ఒక కీటకమునకు పేరు. ఉడుత – ఇది… Continue reading కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు