సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం , మితి మీరిన సెల్ ఫోన్ వాడకం మనిషికి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అంచనాలు.

ఇంకా సమాజంలోసెల్ ఫోన్ అతిగా వాడడం మొబైల్ వాడడం వలన నష్టాలు వివరిస్తూ అనేకమంది ఔత్సాహికులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సెల్ ఫోను వాడుక పెరుగుతూనే ఉంది.

మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణలు మితిమీరుతున్నాయని, అటువంటి సెల్ ఫోన్ మాటల వల్ల రేడియేషన్‌ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు.

మనమద్య సెల్ ఫోన్ రాకముందు సమాజంలో పలకరింపులు బాగుంటే, ఇప్పుడు పలకరింపులు పరిమితమైపోతున్నాయనే భావన బలపడుతుంది.

ఇపుడు సెల్ ఫోన్ వలన నిద్రలేవగానే, ఒకరికొకరు గుడ్ మార్నిగ్ అని చెప్పుకోవడం కంటే నిద్రలేవగానే సెల్ ఫోన్ ను చెక్ చేయడం ఎక్కువైపోయింది. స్మార్ట్ ఫోన్ చూడకుండా తెల్లవారదు, పొద్దుపోదు అన్నచందాన మనిషి జీవన కొనసాగుతుందనే వాదన బలంగా ఉంది.

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు చాలానే చెబుతారు.

  • స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.
  • శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
  • మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం

స్మార్ట్ ఫోన్ వాడుక, అదొక అలవాటుగా మారి వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం.

మన మానవ సమాజం అంతా మానవ సంబంధాలతో సాగుతుంది. నిత్య జీవితంలో బంధుమిత్రులతో కలిసి పనిచేస్తూ, కష్టసుఖాలలో భాగం అవుతూ ఉంటాం.

ఇలాంటి మన మానవ సమాజంలో యంత్రికతకు చోటు తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు మనిషిపై పోకడ పేరుతొ ప్రభావం చూపితే, టివిలు ఒంటరితనం పెంచితే, సెల్ ఫోన్స్ మనిషిపై పూర్తీ యాంత్రికమైన భావనను పెంచుతున్నాయి.

మనకున్న సమాజంలో నిత్యం ఎదో అలవాటుగా పని చేస్తూ, సంపాదన చేస్తూ ఉండే ప్రజల మధ్యలో చదువుకునే బాలబాలికలు ఉంటారు. అలవాటుగా పెద్దల నుండి పిల్లలకు కొన్ని అలవాట్లు సంక్రమిస్తూ ఉంటాయి..

ఇప్పుడు ఆ కోవలోకి సెల్ ఫోన్ వాడుక కూడా చేరుతుంది. తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా ఫోన్ వాడుక పిల్లలల్లో పెరుగుతుండడం పెరుగుతుందని, దాని వలన బాల్యం నుండే పిల్లలలో అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.

ఒక అట వస్తువుగా, ఒక పరికరంగా, ఒక టీవీగా, ఓకే సంభాషణ అందించే పరికరంగా, ఇద్దరితో సమన్వయము చేసే పరికరంగా, బిల్ పే చేసే నేస్తంలాగ, వినోదం పంచె మిత్రుడిలాగా సెల్ ఫోన్ మనిషికి మరింత చేరువై, అది ఒక అలవాటుగా మారుతుంది.

ఎప్పుడు సెల్ ఫోన్ వాడుట కూడా ఒక వ్యసనంగా మారే అవకాశం ఎక్కువ అని అంటారు.

శరీర ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.

సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని తిరిగితే, అది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే, క్యాన్సర్‌ కావాలని కొనుకున్నట్టే. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

అతిగా సెల్ ఫోన్ యూజ్ చేయడం వలన, చేతికి బాధారకమైన స్థితి రావచ్చు, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

అంతేకాకుండా సెల్ ఫోన్ అలవాటుగా మారి వాహన వాడుకలో కూడా ఫోన్ వాడడం పరిపాటి అయిపోతుంది. దీని వలన వాహన ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ.

ప్రతిరోజూ సెల్ ఫోను గంటల తరబడి ఉపయోగిస్తూ, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు కానుందని నిపుణుల మాట.

మరోవైపు సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

సెల్ ఫోన్లో అధికంగా మాట్లాడే వారిలో తలనొప్పి, కళ్ళు తిరగడం, తల తిరగడం, కళ్లు బైర్లుకమ్మడం, ఆకలి మందగించడం, ఆందోళన వంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కూడా ఎక్కువేనని అంటారు.

మానసిక చికాకులు, మనోవ్యాదులు పెరిగే అవకాశం

అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి అన్నింటిలోను అనర్ధమే అని భావన వస్తుంది. ఇది సెల్ ఫోన్ విషయంలో రుజువు అవుతుంది.

ఆత్రుత ఉంటుంది…. రోజు ఆత్రం కలిగించే విషయాలను మనసు మరిగితే, అవే విషయాలను మనసు రోజూ కోరుతుంది. ఇటువంటి ఆత్రం సెల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ వాడుక వలన పెరిగె అవకాశాలు ఎక్కువని అంటారు.

నిత్యం ఒత్తిడికి లోనైతే మొదట కోల్పోయేది నిద్రాసమయం. ఇప్పటికే ఈ సమస్య సమాజంలో ఉంటే, అది సెల్ ఫోన్ వలన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.

సరసమైన ధరలలో నిత్యావసర వస్తువుల కంటే, సరసమైన ధరలలో స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అటువంటి స్మార్ట్ ఫోన్ మనిషి జీవనంలో అంతర్భాగం అయిపొయింది.

సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడానికి ప్రధాన కారణం, దాని నుండి వచ్చే రేడియో ధార్మికత…

పిల్లలపై, తల్లులపై, తండ్రులపై, అత్త, మామలపై ఇలా ఏ బంధం చూసినా ఒంటరిగా మారడానికి సెల్ ఫోన్ ఒక ఆయుధంగా మారుతుంది.

తగు సమయంలో దీనిని గురించి ఆలోచన లేకుండా, అదే పనిగా సెల్ ఫోన్ వాడితే, మనిషిలో యాంత్రికత పెరిగి, మానవ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఎక్కువ.

కాబట్టి సెల్ ఫోన్ అతి వాడుకను అతి త్వరగా నియంత్రణలోకి తీసుకురావలసిన అవసరం అందరికి ఉంది. ఇది అందరి పట్ల ఉన్న ప్రధాన సామజిక భాద్యత గుర్తించవచ్చు.

తెలుగులో వ్యాసాలు

తెలుగురీడ్స్