డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి డొనాల్డ్ ట్రంప్ భిన్నమైన శైలితో అమెరికన్లను ఆకట్టుకున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవి చేపట్టారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త…. వ్యాపారవేత్తగా ఎదిగాకా రాజకీయాలలోకి వచ్చి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు…

డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటనలు చేయడం వార్తలలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకీ, డొనాల్డ్ కు మద్య స్నేహపూర్వక సంబంధం పత్రికల ద్వారా తెలియబడుతుంది.

ప్రపంచంలో అగ్రరాజ్యం అయిన అమెరికా అధ్యక్షులు ఎవరూ కూడా గతంలో ఇంత స్థాయిలో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్టగా లేదు..

తాజాగా డొనాల్డ్ ట్రంప్ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్ చేతిలో పరాజయం పాలైనారు. తత్ఫలితంగా ఈయన అమెరికా పదవి నుండి తప్పుకోనున్నారు… అయితే ఈయన ఈ పదవి నుండి తప్పుకోవడంలో కూడా అమెరికాలో కొన్ని ఘటనలు వార్తలోకెక్కడం విశేషం.

ట్రంప్ జీవితం

డొనాల్డ్ ట్రంప్ 1946వ సంవత్సరంలో జున్‌ నెలలో 14వ తేదీన, ఫ్రెడ్‌ ట్రంప్‌- మేరీ అన్నా మెక్‌లాయిడ్‌ దంపతులకు జన్మించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ జన్మించిన నగరం న్యూయార్క్‌ నగరం. ట్రంప్‌ తండ్రి జర్మనీవాసి అయితే.. తల్లి స్కాట్లాండ్‌ వాసి…

డొనాల్డ్ ట్రంప్‌ బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్‌లోనే పూర్తయ్యాయి. ఆ తరువాత ఆయన అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు చదివారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్‌లూన్‌ స్కూల్‌ నుండి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

ట్రంప్‌ మొదట్లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుటుంబ సంస్థ ఎలిజబెత్‌ అండ్‌ సన్స్‌లోనే ప్రారంభించారు. ట్రంప్ తొలి ప్రాజెక్టును తన తండ్రితో కలిసి పూర్తి చేశారు.

ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే 1971లో కంపెనీ పేరును ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌గా మార్చేశారు. ఇంకా ఆ ఆఫీసును కూడా మాన్‌హట్టన్‌కు మార్చారు. ట్రంప్ 1978సంవత్సరంలో అక్కడ గ్రాండ్‌ హయత్‌ హోటల్‌ను నిర్మించారు.

ఇంకా అమెరికాలోనే ఆయన పలు ప్రముఖ భవనాలు నిర్మించారు. అందులో బాగంగా ట్రంప్‌ ఓషన్‌ క్లబ్‌, ట్రంప్‌ టవర్‌, సెంట్రల్‌ పార్క్‌లోని వూల్మాన్‌ రింక్‌ హోటల్‌ ఉన్నాయి. ఆపై ట్రంప్ ప్లాజా హోటల్‌, అట్లాంటిక్‌ సిటీలోని తాజ్‌మహల్‌ కేసినోలను కొనుగోలు చేశారు.

క్రీడాలు అందాల పోటీలు ప్రమోషన్ చేసిన డొనాల్డ్ ట్రంప్

ఈయన కేవలం కేవలం వ్యాపరమే కాకుండా క్రీడలు, అందాల పోటీలను కూడా అద్భుతంగా ప్రమోట్‌ చేశారు. 1996 నుంచి 2015 వరకు జరిగిన అందాల పోటీలలో మిస్‌ యూనివర్స్‌, మిస్‌ యూఎస్‌ఏ, మిస్‌టీన్‌ యూఎస్‌ఏ పోటీలను ట్రంప్ ప్రమోట్‌ చేశారు. ఆ క్రమంలోనే ఎక్కువ సార్లు మిస్‌వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీలను ప్రమోట్‌ చేసినవారిగా ట్రంప్ ఉన్నారు.

వ్యాపారం, క్రీడల ప్రచారం, అందాల పోటీల ప్రమోషన్ చేయడమే కాకుండా ఈయన రాజకీయాలలో కూడా ప్రవేశించారు. ఈయన రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీలు మారడం జరిగింది. మొదట్లో ట్రంప్ రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా నిలిచారు.

ఆ తర్వాత ఆయన రిఫార్మ్‌ పార్టీ వైపు మొగ్గు చూపారు. మరలా మూడేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. 2001సం|| నుండి 2008సం`|| వరకు ఆయన డెమొక్రాట్‌ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన జాన్‌ మెక్‌కెయిన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్‌ పార్టీలోకి వచ్చారు. అప్పటి నుండి రిపబ్లికన్ పార్టీలోనే కొనసాగారు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌ ప్రయత్నాలు కొనసాగించారు. 1988, 2004, 2012, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా.. ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. కొన్నాళ్ల తర్వాత ఆయన ప్రయత్నాలు ఫలించాయి.

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి
డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

2015 జూన్‌ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నారు. మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ట్రంప్ ప్రచారం ప్రారంభించారు. ఈ ఎన్నకలలో ట్రంప్ విభిన్నమైన ప్రచారానికి తెరతీశారు. మూడు సార్లు నిర్వహించిన జనరల్‌ ఎలక్షన్‌ డిబేట్స్‌లోను హిల్లరీ క్లింటన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అయినా ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రచారం కొనసాగించారు. ట్రంప్ విభిన్నమైన ప్రచారంతో, అంతిమంగా ఆయన అనుకున్నది సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా అవతరించారు.

ఆ విధంగా 2016 నుండి 2021 జనవరి వరకు 45వ అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగారు… డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోయే జోబైడెన్ కు పగ్గాలు అప్పజెప్పి, అధ్యక్ష పదవి నుండి వైదొలగనున్నారు…

తెలుగు వ్యాసాలు తెలుగులో

తెలుగురీడ్స్ హోమ్