కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు.

లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు… ఈ క్రిందిగా…

ఈగ – ఇది ఒక కీటకమునకు పేరు.

ఉడుత – ఇది ఒక జీవి పేరు

ఊయల – పిల్లలను అటు ఇటు ఊపడానికి ఉపయోగించే సాధనం.

ఋషి – తపస్సు చేసిన వారిని ఋషి అంటారు.

ఎలుక – జంతువు పేరు

ఏనుగు – జంతువు పేరు

ఒంటె – జంతువు పేరు

ఔషధము – వ్యాధి నయం చేసే పదార్ధము

అంబరము – ఆకాశం

నింగి – ఆకాశం

దుఖం – వ్యక్తికి మనసుకు బాధ కలిగించు నప్పుడు ఉపయోగించు భావనాత్మక పదం

సుఖం – వ్యక్తికి మనసుకు బాధ సంతోషం నప్పుడు ఉపయోగించు భావనాత్మక పదం

శాంతి – అలజడి లేని మనసు యొక్క స్థితిని శాంతి అను భావనాత్మక పదంతో సంభోదిస్తారు.

సుఖశాంతులు – సంతోషంతో శాంతిగా నిలిచిన వ్యక్తి జీవన స్థితి గురించి తెలియజేయు పదం.

సుఖదుఖాలు – బాధతో ఉన్న వ్యక్తి జీవన స్థితి గురించి తెలియజేయు పదం.

మమకారం – ప్రేమను పంచడంలో వ్యక్తి నుండి వ్యక్తమయ్యే భావనను తెలుపు భావనాత్మక పదం.

తెలుగు పదాలు వస్తువులకు పేరుగా ఉండచ్చు లేక సాధనములకు లేక వ్యక్తులకు

ఖడ్గము – జంతువును ఖందించడానికి ఉపయోగించు సాధనము.

గంప – కొన్ని వస్తువులను నింపుకుని ఎదురు బద్దలతో అల్లిన వస్తువు… ఎక్కువగా తలపై పెట్టుకుని మోస్తూ
బుట్ట – కొన్ని వస్తువులను చేతితో మోసుకెళ్లడానికి వీలుగా ఉండే సాధనము. ఇవి ఎదురు బద్దలతో లేక ప్లాస్టిక్ మెటీరీయల్ తో చేయబడవచ్చు.

బుట్టబొమ్మ – బుట్ట మాదిరిగా ఉండే బొమ్మను బుట్ట బొమ్మ అని సంభోదిస్తూ ఉంటారు.

ముద్దు – ప్రేమానురాగలు తెలియజేయు చిహ్నంగా జరుపు భావాత్మక చర్య….

వాజ్మయం – వాక్ రూపంలో చెప్పబడడానికి అర్హత కలిగిన విషయ విజ్నానం గ్రంధంగా ఉంటే… అటువంటి గ్రంధాలను వాజ్మయం అంటారు…

చలి – తక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వాతావరణమును చలిగా సంభోదిస్తారు.

వేడి – ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వాతావరణమును వేడిగా సంభోదిస్తారు.

కుండ – మట్టితో చేయబడిన పనిముట్టు.

ఛత్రము – వాన వచ్చినప్పుడు తడవకుండా, ఎండగా ఉన్నప్పుడూ నీడ కొరకు వాడే వస్తువు… అదే గొడుగు…

జడ – పొడవైన వెంట్రుకలను ఒక తాడువలె అల్లుకోవడాన్ని జడ అంటారు…

జాడ – ఆచూకీ అని కూడా అంటారు.

బాట – ఒక గమ్యం చేరడం కొరకు నడవడానికి అనుకూలంగా ఉండే దారిని బాట అంటారు

తెలుగు పదాలు సంభోదించే బంధం కావచ్చు

బావ – ఇది ఒక బంధం. అత్త కొడుకు లేక మేనమమ కొడుకుని బావ అని సంభోదిస్తారు.

బావి – భూమిలో నీరు నిల్వ ఉండడం కొరకు లోతుగా తీయబడి, నీరు వాడుకోవడానికి ఉపయుక్తంగా నిర్మించబడినది…

టపా – ఒకరి నుండి వేరొకరికి సందేశం అందించేది.

ఆభరణము – అలంకారంగా మనిషి శరీరంపై ధరించేది.

నాగ – ఒక జాతి పాముకు గల పేరు… పాము స్వరూపంలో ఉండే దైవమును నాగదేవతగా పిలుస్తారు. వ్యక్తుల పేర్లకు కూడా ఈ పదం ఉపయోగిస్తారు.

నగ – బంగారం వంటి లోహాలతో చేయబడిన ఆభరణం

నగిషీ – నగకు మెరుగు పెట్టడం.

డబ్బా – లోహముతో చేయబడిన పనిముట్టు

డబ్బు – మనిషి జీవనవిధానంలో మారకముగా ఉపయోగపడునది.

ధనం – డబ్బుకు పర్యాయ పదం

కోశాగారము – ధనము, నగలు వాటి విలువైన వస్తువులను నిల్వ చేయు గది

వంట – తినే పదార్ధాలను తయారు చేయు ప్రక్రియ

గాడి – ఒక పని విధానం పూర్తి చేయడానికి ఏర్పడి ఉన్న మార్గము.. నీరు ప్రవహించడానికి…

గాడిద – ఒక జంతువుకు సంభోదన

గారు – వ్యక్తి గౌరవ సూచకంగా పేరు చివరలో వాడు పదము

రధము – మనిషి ప్రయాణం చేయడానికి గుర్రాలతో లాగబడే ఒక వాహనం.

దండ – మెడలో వేయడానికి ఒక తడుకు ఎక్కువ పూలను గుచ్చబడినది.

ధనుస్సు – బాణం సంధించడానికి ఉపయోగించు సాధనం వంగే గుణం కలిగిన కర్ర వంటి వస్తువును కొంతవరకు వంచి, అలా వంచిన కర్రకు రెండు చివరలు కలుపుతూ ఒక తాడును కట్టి తయారు చేసే సాధనమును విల్లు, ధనుస్సు అంటారు.

బాణం – గుచ్చుకోవడానికి వీలుగా ఒక చివర త్రికోణాకృతిలో సూదిగా, రెండవవైపు విల్లుతాడుకు అనుసంధానించే విధంగా లోహముతో తయారుచేయబడి ఉంటుంది. ఒక చోట నిలబడి బాణమును లక్ష్యంవైపు సంధించవచ్చు.

శరం – బాణమునకు మరొక పేరు శరం… అంటే ఇది పర్యాయపదం..

నత్త – సముద్రపు నీటిలో జీవించే జీవి.

పలక – అక్షరాలు దిద్దాడానికి లోహంతో కానీ మట్టితో కానీ చేయబడిన సాధనం.

పాలకులు – అధికారం కలిగి ఉన్నవారిని పాలకులు అంటారు.

పరిపాలన – అధికార వినియోగం

వ్యవస్థ – వ్యక్తులతో ఏర్పడిన ఒక విధానం

మరిన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు జతచేయబడతాయి….

తెలుగులో వ్యాసాలు

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

తెలుగు వ్యతిరేక పదాలు

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

భక్తిమార్గం

వీడియోదర్శిని

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగులో కధలు