మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి.

అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది.

సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి.

మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, దానం చేయడం, చెప్పిన మాట వినడం, సాయం చేసే గుణం కలిగి ఉండడం మొదలైనవి…

ఒక వ్యక్తి గురించి వ్యాసం వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించిన గుణగణములు తెలియాలి. ముఖ్యంగా ఆవ్యక్తిలో ప్రధానమైన మంచి గుణములు తెలియాలి.

అందరికీ నచ్చిన ఆ గుణములు గురించి మనకు తెలియాలి. సాధారణంగా వ్యాసరచన చేస్తున్నామంటే, అతని పాపులరిటి కలిగిన వ్యక్తి అయి ఉంటాడు.

కనుక అతని గుణగణాలు అందరికీ తెలిసినవే ఉంంటాయి. వాటిని మనం వార్తా పత్రికలు, టివిలు, ఆన్ లైన్ న్యూస్ చానల్స్ ద్వారా తెలుసుకోవచ్చును.

ఇంకా మన చుట్టుప్రక్కల ఉండే కొందరు పెద్ద మనుషుల గురించి కూడా మన చుట్టూ ఉండేవారు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గురించి మనకు మాములుగానే తెలిసి ఉంటుంది.

అప్పుడు ఆ వ్యక్తి పేరు, పుట్టిన ఊరు, పుట్టిన తేది, పెరిగిన నేపధ్యం, చదువు, వృత్తి ఉద్యోగాలు, బంధు మిత్రులను పరిచయం చేస్తూ క్లుప్తంగా వివరించాలి.

ఆ తర్వాత అతని పుట్టిన నాటి నుండి అతని జీవితంపై ప్రభావం చూపిన సంఘటనలు వ్రాయాలి.

అతని జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తులు, అతని జీవితంలో మార్పుకు నాంది పలికిన మలుపులు… తెలుసుకుని వాటి గురించి వ్రాయాలి…

ఇవి పూర్తయ్యాక ప్రధానముగా వ్యక్తి సమాజంలో కీర్తిగడించిన అంశమును గురించి వ్యాసములో విపులంగా విస్తారంగా వివరించాలి.

మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, బాగంగా అందరికీ తెలిసిన నరేంద్ర మోదీ గారి గురించి వ్యాసం

క్లుప్తంగా వివరణ: నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధానమంత్రి. అంతకుముందు ఆయన గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి. నరేంద్రమోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఈయన 1950 సెస్టెంబర్ 17న జన్మించారు. ఈయన తండ్రి దామోదర్ దాస్, తల్లి హీరాబెన్ మోదీ… రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఈయన శాకాహారి….

ఇప్పుడు నరేంద్ర మోదీ గారి బాల్యం గురించి

గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు. అక్కడి స్థానిక పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో నరేంద్రమోదీగారు రాజనీతి శాస్త్రములో మాస్టర్స్ డిగ్రి పట్టభద్రులయ్యారు. ఈయన విద్యార్ధి దశలోనే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఒక మారుమూల టీ అమ్మిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగింది.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

భారతీయ జనతా పార్టీలో నరేంద్రమోదీ 1987 సంవత్సరంలో చేరారు. అచిర కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అందుకున్నారు. ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో 1990లో జరిగిన అయోధ్య రధయాత్రలో ఇన్ చార్జ్ గా పనిచేశారు. అదేవిధంగా మురళీమనోహర్ జోషి తలపెట్టిన కన్యాకుమారి టు కాశ్మీర్ రధయాత్రకు కూడా ఇన్ చార్జ్ గా పనిచేశారు. అనతి కాలంలోనే కేశుభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 2001లో ముఖ్యమంత్రిగా మారిన మోదీగారు ప్రధాని అయ్యేవరకు గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రిగానే పనిచేస్తూ ఉన్నారు.

దేశప్రధానిగా నరేంద్ర మోదీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని అభ్యర్దిగా పోటీ చేశారు. అంచనాలకు భిన్నంగా నరేంద్రమోదీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలలో విజయం సాధించింది. ఎంపిగా పోటీ చేసి, గెలిచిన తొలిసారే ప్రధాని పదవిని అధిష్టించారు.

ఈయన దేశప్రధానిగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియగా ఉంది. అర్ధరాత్రి అప్పటికప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దేశ మొత్తం ఆశ్చర్యపోయింది. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. జిఎస్టీ అమలు చేయడంలో కూడా కృషి జరిగింది. ఇంకా మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా(NRC) అమలు వంటివి ఉన్నాయి

2014 మే 26న భారతదేశ పదిహేనవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు.

విశిష్ట లక్షణాలతో భారతదేశాన్ని ముందుండి ముందుకు నడిపిస్తున్నందుకు గాను మోడీకి అవార్డు అవార్డు దక్కింది జనవరి 14 2019 లో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు.

నరేంద్ర మోదీ ప్రత్యేకతలు

పాపులర్ ప్రధానమంత్రిగా, అశేష ప్రజాధరణ కలిగిన నాయకుడు

రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు.

గుజరాత్ రాష్ట్రమునకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.

అధునిక పరిజ్ఙానం వాడుకుంటూ పాపులారిటీ పెంచుకోవడంలో ఈయనకు ఈయనే సాటి.

అందరికీ తెలిసిన వ్యక్తి గురించి వ్రాస్తే, వ్రాయడం ఎలా అనే కాన్సెప్ట్ అర్ధం అవుతుందిన నరేంద్రమోదీ గారి గురించి ఒక వ్యాసంలోకి తీసుకురావడం జరిగింది.

ఈయన గురించి ఇంకా చాలా వివరాలు ఆన్ లైన్లో పబ్లిక్ డొమైన్లలో లభిస్తుంది.

వ్యాసం ప్రారంభం, వ్యాసం ముగింపు క్లుప్తంగా అర్ధవంతంగా ఉంటే బాగుంటుంది.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం అంటే మనం ఎరిగినవారిలో మంచి గుణాలు కలిగిన వారిని ఎంచుకోవాలి.

మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించి తెలిసినవారు ఏమనుకుంటున్నారో చూడాలి. లేదా ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే వాస్తవాలు వ్రాయగలుతాము.

ధన్యవాదాలు తెలుగు వ్యాసాలు

తెలుగురీడ్స్ హోమ్