పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం
పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం. క్లాసులో సమాధానం చెప్పాలి. పరీక్షలో పేపరుపై బాగా వ్రాయాలి. అర్ధవంతంగా సమాధానాలు వ్రాయడం ప్రధానం.

SSC పరీక్షలు ఫెయిల్ అయితే అంతే, అనే భావన కొందరిలో ఉంటుంది. అటువంటి భావన వలన బాగా చదివేవారు కూడా పదవతరగతికి వచ్చేసరికి వెనుకబడే అవకాశం ఉంటుంది. కనుక పదవతరగతి బాగా చదవాలనే బలమైన సంకల్పం చేసుకోవాలి. అందుకోసం కృషి చేయాలి.

ఇష్టపడి చదివితే, చదివే సమయం కష్టం తెలియకుండా ఉంటుంది. సమయం అంతా చదువుపై అవగాహన ఏర్పడడంలోనూ లేక గుర్తుపెట్టుకోవడంలోనూ సాగిపోతుంది. ఇష్టమైన హీరో సినిమా బాగుంటే, 2.30 గంటలు ఇట్టే గడిచినట్టు, పదవతరగతి చదివే సమయం అంతా చదివే ప్రక్రియలోనే గడిచిపోతుంది.

SSC ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి గ్రేడ్ సాధిస్తే, జీవితంలో అదొక మైలురాయి. ఎప్పుడు మైలు రాయిని చేరుకునే సమయంలో ముందడుగు వేయాలి… కానీ బలహీనతలు గుర్తుకు తెచ్చుకోకూడదు.

పరుగు పందెంలో పాల్గొన్న అందరిలోనూ ఒక్కడే విజేత అవుతారు. కానీ మిగిలినవారు విజేతలు కాకపోయినా, ప్రయత్నం లోపం ఉండదు. కాబట్టి వారు పందెంలో గెలవకపోయినా తమ ప్రయత్నంపై తాము తృప్తిగా ఉంటారు. మరొకసారి బాగా ప్రాక్టీస్ అయ్యి, విజేతగా నిలవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు.

అలాగే SSC చదువుతున్న విధ్యార్ధులు కూడా, నెలవారి టెస్టులలో తమకు లభిస్తున్న మార్క్స్ గమనించుకోవాలి. ప్రతిసారి గట్టి ప్రయత్నంతో చదవాలి. ఇంటర్నల్ గా స్కూల్లో జరిగే టెస్టుల్లో మార్క్స్ మెరుగుపడుతూ ఉండేలా చూసుకుంటూ ఉంటే, అదే అలవాటు SSC ఎగ్జామ్స్ అప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది.

ప్రధానంగా పదవతరగతి ప్రారంభం నుండే తమకు బలమున్న సబ్జెక్టులలో పట్టు పెంచుకుంటూ, తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో తగినంత కృషి చేయాలి. బలమున్న సబ్జెక్టులు అంటే, మీకు ఆయా సబ్జెక్టులలో అవగాహన ఎక్కువ. కాబట్టి పాఠాలు వింటున్న సమయంలోనే వాటిలో మీకు పట్టు పెరుగుతుంది.

తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో అవగాహన ఏర్పరచుకోవడంలో ఏదో లోపం ఉంటుంది. అది గుర్తిస్తే వాటిలో కూడా మంచి మార్కులు సాధించవచ్చు. ఎంత ప్రయత్నించినా అవగాహన కానీ సబ్జెక్టులలో ఒకటికి పదిసార్లు చదివి గుర్తుపెట్టుకునే విధానం ఉత్తమం.
ఇంకా ఇలా తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులలో ముఖ్యమైన ప్రశ్నలు పేపరుపై వ్రాస్తూ ఉండడం కూడా మేలైన పద్దతి.

ఒకసారి వ్రాయడం అంటే, కొన్ని సార్లు చదవడం వంటిది. ఎక్కువ సార్లు వ్రాసిన సమాధానం గుర్తు ఉండే అవకాశం ఎక్కువ.
అతి అన్నింటిలోనూ అనర్ధం అంటారు. బాగా మార్కులు వచ్చే సబ్జెక్టులపై నిర్లక్ష్యం ఉండకూడదు. అలాగే తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టులంటే భయం లేక చికాకు ఉండకూడదు.

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా సమాధానాలు వ్రాయడం ప్రధానం

ఇక క్వశ్చన్ పేపర్ చూడగానే, చదవని క్వశ్చన్స్ వస్తే, టెన్షన్ తెచ్చుకోవడం. చదివిన క్వశ్చన్స్ వస్తే ఓవర్ ఎగ్జైట్ అవ్వడం మానేయలి.
ఎగ్జామ్స్ వ్రాసే సమయంలో క్వశ్చన్ పేపర్ తీసుకుని, దానిలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిని చదివాలి. అలా క్వశ్చన్ పేపర్లో బాగా గుర్తు ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అలా బాగా వచ్చిన క్వశ్చన్లకు చూసుకుని, వాటికి సమాధానాలు వ్రాయడానికి మైండును సరిగా ప్రిపేర్ చేసుకోవాలి.

ముందుగా బాగా గుర్తున్న క్వశ్చన్లకు సమాధానాలు తేలికగా వ్రాయవచ్చు. అలా వ్రాసిన సమాధానాలు పాయింట్ల రూపంలో అర్ధవంతంగా వ్రాయగలిగితే, మంచి ఇంప్రెషన్ ఉంటుంది.

కొన్ని క్వశ్చన్లకు సమాధానాలు పూర్తిగా గుర్తు ఉండవు. అలాంటి క్వశ్చన్లను ముందుగా వ్రాయడం మొదలు పెడితే, బాగా గుర్తు ఉన్న సమాధానాలు కూడా మరిచిపోయే అవకాశం ఉండవచ్చు. కాబట్టి మైండులో పూర్తి సమాధానాలు గుర్తుకు వస్తున్న ప్రశ్నలకు ముందుగా సమాధానాలు వ్రాయడం మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది.

బాగా గుర్తు ఉన్న క్వశ్చన్లకు సమాధానాలు వ్రాయడం పూర్తయ్యాక, సగం, సగం గుర్తు ఉన్న క్వశ్చన్లకు సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు. అయితే సగం సగం గుర్తు ఉన్న క్వశ్చన్లు ఎక్కువగా ఉంటే, అలాంటి క్వశ్చన్లకు అన్నింటికీ సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టడం బెటర్. అయితే ప్రతి క్వశ్చనుకు సమాధానం వ్రాశాక కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. సగం సగం గుర్తు ఉన్న క్వశ్చన్లు అన్నింటికీ సమాధానాలు వ్రాసేసి, ఆ తర్వాత మిగిలిన ఆన్సర్స్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం మేలు.

మొత్తానికి ఒక క్వశ్చన్ పేపరులో మనకు బాగా వచ్చిన ప్రశ్న నుండి సమాధానం వ్రాయడం మొదలు పెట్టాలి. బాగా గుర్తు ఉన్న క్వశ్చన్లు అన్నీ ముందుగా వ్రాయడం వలన పేపరు దిద్దేవారి దృష్టిలో మంచి గుర్తింపు పడుతుంది. ఆపై గుర్తుకు వచ్చినంత సమాధానాలు మిగిలిన క్వశ్చన్లకు వ్రాయడం చేయాలి.

గుర్తు ఉన్నంతవరకు సమాధానాలు వ్రాశాక, తెలిసిన మేరకు సమాధానాలు వ్రాయడం మొదలు పెట్టాలి. మొత్తానికి క్వశ్చన్ పేపర్లో వ్రాయవలసిన అన్నీ క్వశ్చన్లకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి.

పరీక్ష వ్రాసేటప్పుడు గుర్తుకు రాని క్వశ్చన్లకు సమాధానాలు వెతకడం అంటే, సమయం వృధా చేయడమే అవుతుంది. చివరలో హడావుడిగా బాగా వచ్చిన సమాధానం కూడా తప్పులతో వ్రాసే అవకాశం ఎక్కువ.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎటువంటి జాగ్రత్తలు అంటూ ఆలోచన అనవసరం. సాదారణ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే ప్రిపేర్ అయితే చాలు. కానీ చదివేటప్పుడు మాత్రం కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇష్టపడి చదివితే, సబ్జెక్టుపై అవగాహన సులభంగా వస్తుంది.

అనవసరపు భయాలు, ఒత్తిడికి గురి కావడం అనేది మీ మనసులోనే ఉంటుంది. మీ మనసులో ఒక్కటే ఎగ్జామ్స్ బాగా వ్రాయాలి…. చదివిన క్వశ్చన్స్, గుర్తులో ఉన్న క్వశ్చన్స్, గుర్తుకు వస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం ప్రధానం.

ఎంత బాగా చదివినా, ఎంత బాగా పేపరుపై వ్రాయగలమో అన్నీ మార్క్స్ గెయిన్ చేయగలరు. మంచి గ్రేడ్ సాధించగలరు.

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం