మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ, పరోక్షంగా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.

పరిశుభ్రత మనిషి ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనది. మనిషి తన వంటికి పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే తన నివాసం పరిశుభ్రతగా ఉంటుంది.

తను ఆరోగ్యంగా ఉండడం తన ప్రధాన అవసరం అయితే, తన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం సామజిక అవసరం.

తన గురించి తన చుట్టూ ఉండే వారి గురించి పరిశుభ్రతను పాటిస్తే, ఒక సామజిక బాద్యత నిర్వహించిన వారవుతారు. మనిషి ఆరోగ్యం పరిశుభ్రత ఆధారంగా ప్రభావితం అవుతుంది. పరిశుభ్రత గల ప్రదేశంలో పరిశుభ్రతతో ఉన్న శరీరంతో పరిశుభ్రతమైన ఆహారం తీసుకోవడం కుటుంబ ధర్మాలలో ఒక్కటిగా ఉంటుదని అంటారు.

ఒక మనిషి తన పరిశుభ్రతతో బాటు పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తే అది సమాజం పట్ల తన కర్తవ్యమ్ నిర్వహించినట్టే అవుతుంది. అలాగే సామాజిక పరిశుభ్రత కోసం కృషి చేయడంతో సామజిక సేవ చేసినట్టే అవుతుంది.

వ్యక్తీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలలో ఉండే పరిసరాలు అంటే అవి నివసించే ఇల్లు, తిరిగే దారులు, పనిచేసే కార్యాలయాలు, నేర్చుకునే స్థలాలు, చదువుకునే విద్యాలయాలు ఇలా అనేక రకమైన పనులలో అనేక రకాలుగా పరిసరాలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.

ఇల్లు పరిశుభ్రతతో ఉంటే, ఆ ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది.

ఒక ఇంట్లో ఒక వ్యక్తికి అంటువ్యాది వస్తే, అది ఆ ఇంట్లో అందరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు పరిసరాలలో పేరుకుపోయిన చెత్త వలన క్రిములు పెరిగి, ఆ క్రిముల వలన వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి అంటువ్యాధులు నివారణకు ముందుగానే పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడం మనిషిగా కనీస సామజిక బాధ్యతగా చెబుతారు.

చదువుకునే విద్యార్ధులు ఉండే విద్యాలయాలు పరిశుభ్రతగా లేకపోతే ఆ పరిసరాలలో ఏర్పడే సూక్ష్మజీవుల వలన అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని విద్యాలయాల కార్యవర్గం, విద్యాలయాలలో ఉండేవారు, విద్యార్ధులు కూడా అందరు ఆయా విద్యాలయాల పరిసరాల పరిశుభ్రత గురించి శ్రద్ధ తీసుకుని పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలి.

పరిశుద్దమైన ఆహారం, పరిశుద్ధమైన పానీయం తీసుకోవడం వ్యక్తిగా అందరికి ఆరోగ్య నియమలుగా చెబుతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం మరొక వ్యక్తిపై పడుతుందని కరోన వైరస్ కారణంగా అందరికి తెలిసి వచ్చింది. ఆరోగ్యం చెడినవారికి కరోన వైరస్ త్వరగా వ్యాపించి, వారిద్వారా మరింతమందికి కరోన సోకినా ఘటనలు ప్రపంచంలో గత ఏడాది నుండి జరిగాయి.

ఈ కరోనా వైరస్ కారణంగా పారిశుధ్యం, ఆరోగ్యం పరిశుభ్రత, పరిశుభ్రత నినాదాలు పెరిగాయి. పారిశుధ్యంతో కూడిన ఆహారం తీసుకుంటే, వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, అంటువ్యాధులు త్వరగా సోకవు. లేకపోతే అంటువ్యాధులు ప్రభాలుతాయి. కావున వ్యక్తి తన ఆరోగ్యపరిరక్షణ చేసుకోవడం పరోక్షంగా సామజిక పరిరక్షణ కూడా చేసినట్టే అవుతుంది.

బలమైన వ్యక్తికీ బరించే బలం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు వైరస్ బారిన పడకుండా తమనుతాము రక్షించుకుంటూ ఇతరులను అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడినవారవుతారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం అంటే, సమాజాన్ని ఆరోగ్యపరంగా రక్షించినవారమవుతాము.

పనిచేసే కార్యాలయాలలో, పని చేసే కర్మాగారాలలో ఆయా పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఒక కార్యాలయంలో కానీ ఒక కర్మాగారంలో కాని వ్యక్తికి అంటువ్యాధి సోకితే, వారి ద్వారా, వారి చుట్టూ ఉన్నవారికి ఇంకా వారి వారి కుటుంబ సభులకు కూడా అంటువ్యాధి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటువ్యాధులు ప్రభాలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన కర్తవ్యం అందరిపైన ఉంటుంది.

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ తద్వారా ఆరోగ్యపరంగా సామజిక సేవ కూడా అవుతుంది.

తెలుగులో వ్రాసిన వ్యాసాలు

తెలుగురీడ్స్ హోమ్

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం