ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో రీడ్ చేయండి.

దేవాయలం అంటే దైవ నిలయం… దేవుడిని ప్రతిష్టించి, పూజించడం, లేక వెలసిన దేవుడికి ఆలయనిర్మాణం జరిగి పూజించడం దేవాలయాలలో జరుగుతంది.

ప్రతి దేవాయమును అర్చకస్వామి ఉంటారు. ఈ దేవాలయం కొందరు దేవస్థానం అంటారు, మరికొందరు మందిరం అంటారు. కొన్ని చోట్ల గుడి అని వాడుక భాషలో అంటారు.

మన దేశం చాలా విశిష్టమైన దేశం సంప్రదాయబద్దమైన కుటుంబ జీవనం భారతదేశంలో ఆనాదిగా వస్తుంది. అనేక కుటుంబాలలో పూర్వుల నుండి వస్తున్న ఆచారాలను ఆచరిస్తూ ఉండే కుటుంబాలు అనేకంగా మన దేశంలో ఉంటాయి.

అలాంటి మన భారతదేశంలో దేవాలయాల దర్శనం ఒక ఆచారం. ఒక సంప్రదాయం మరియు భక్తిపూర్వకమైనది.

ఆలయంలో ఉన్న దేవుడికి మొక్కడం, మొక్కులు తీర్చడం… పూలు, పళ్ళు, ధనం, బంగారం వంటి కానుకలు భక్తులు సమర్పించడం జరుగుతుంది.

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి మరియు నిత్యం భక్తుల కోలాహాలంతో దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి.

దేవాలయం అంటే దేవుని నిలయం అని అర్ధం. ఏ దేవుడిని ఆలయం ఆదేవుని పేరుతో పిలవబడుతుంది. విఘ్నేశ్వరాలయం, సుబ్రహ్మణ్యాలయం, వైష్ణవాలయం, శివాలయం ఆలయానికి ముందు దైవనామం ఉంటుంది.

దేవాలయాల చర్రిత:

హిందూ దేవాలయాల చరిత్ర అంటే తెలుగు పురాణా పుస్తకాలు చదవాల్సిందే… ఏనాటి నుండే ఉండే ప్రముఖ ప్రసిద్ద దేవాలయాలు అనేకంగా భారతదేశంలో గలవు.

పురాణ పుస్తకాలలో కూడా దేవాలయాల గురించి ప్రస్తుతిస్తారు… అలాగే ఆయా ఆలయాలలో ఉండే దైవమును గురించి ఆయా దైవనామములతో పురాణ పుస్తకాలు కలవు.

శివాలయం అంటే ఆ ఆలయంలో శివుడు మూలవిరాట్టు… ఆయన పేరుపై శివమహాపురాణం గ్రంధం కలదు.

రామాలయంలో దేవుడు శ్రీరాముడు, ఆయనకు ఇతిహాసమే ఉంది… అదే శ్రీరామాయణం.

ఇంకా విష్ణువు మూలవిరాట్టుగా దేవాలయాలు ఉన్నాయి… విష్ణువు గురించి తెలిపే విష్ణు పురాణం కలదు.

ఒక్కో దేవాలయానికి ఒక్కో చారిత్రక, ఇతిహాస గాధలు ప్రసిద్ది చెంది ఉంటాయి… వేల కొలది సంవత్సరాల క్రితం ఆలయాలు కూడా భారతదేశంలో ఉంటాయి.

అయితే పేపర్ పుట్టాక చరిత్రగా చదువుకుంటున్న మనం, పేపర్ పుట్టకముందే, తాళపత్ర గ్రంధాలు మీద వ్రాయబడిన చరిత్ర మనదేశంలో ఉంది… అంటే తాళపత్రములను అందించే చెట్టు పుట్టినప్పుడు నుండే దైవ చరిత్రలను ఋషులు తాళపత్రగ్రంధాలపై లిఖించారని అంటారు.

పురాణాలలో చరిత్రను కల్పములు, యుగములు, యుగభాగములు మొదలైన విధంగా చెబుతారు… అలా చూసుకుంటే, భారతదేశంలోని దేవాలయాల చరిత్ర ఏనాటిదో… అవుతుంది.

కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన దేవాలయం, స్వామి వారు రాకముందునుండే ఆదివరాహస్వామి వారు దైవంగా ఉన్నారని అంటారు… అంటే తిరుమల తిరుపతి ఎంత పురాతనమైనదో అర్ధం అవుతుంది.

భారతదేశంలో ప్రముఖ ప్రసిద్ద దేవాలయాలు:

ప్రసిద్ది చెందిన దేవాలయాలు భారతదేశంలో ఎక్కువగానే ఉంటాయి. వాటిలో కాశీ చాల ప్రధానమైన దేవాలయం. పళని, జలకంటేశ్వరాలయం, శ్రీ రంగ క్షేత్రం, ప్రయాగ, గయా, రామేశ్వరం, అరుణాచలం, మధుర మీనాక్షి, కంచి ఇలా చాల ప్రసిద్ది చెందిన ప్రముఖ దేవాలయాలు భారతదేశంలో భాగమై ఉన్నాయి.

అనంతపద్మనాభా స్వామి ఆలయం, గురువాయుర్ శ్రీకృష్ణమందిరం, అయ్యప్ప దేవాలయం, త్రయంబకేశ్వరం, సిద్దివినాయకమందిరం, విరుపాక్ష ఆలయం, మహాబలిపురం, తిరువణ్ణామలై, చిదంబరాలయం, పావుగడ కాళిమాత ఆలయం, వైష్ణోదేవీ ఆలయం, పూరీ జగన్నాధ ఆలయం, స్వర్ణ దేవాలయం, పండరీ పురం, హరిద్వార్, వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాస్థానం, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం తదితర దేవాయాలు కలవు.

తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, అంతర్వేది, మహానంది, మంత్రాలయం, ద్వారకా తిరుమల, సింహాచలం, కోరుకొండ, మందపల్లి, అమరావతి, అరసవల్లి, అన్నవరం, ద్రాక్షారామం తదితర దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమై ఉన్నాయి.

దేవాలయ నిర్మాణం

దేవాలయ నిర్మాణం ఎవరు చేపట్టారు అంటే సమాధానం కూడా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని దేవాయాలు స్వయంభూ దేవాలయలుగా చెబుతారు. అంటే స్వయంగా దేవాలయాలు వెలిసినవి.

కాశీ విశ్వేశ్వరాయలం స్వయంభూ దేవాలయల అంటారు. ఇలా కాశీ వంటి దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నట్టు పెద్దలు చెబుతూ ఉంటారు.

కొన్ని దేవాలయాల నిర్మాణం భారతదేశపు రాజులు నిర్మించినట్టుగా చరిత్రకారులు చెబుతారు. కొందరు రాజులు దేవాలయాలను పునర్మించడం, మరమ్మత్తులు చేయించడం చేసినట్టుగా చరిత్ర తెలియజేస్తుంది.

దేవతలే స్వయంగా ఆలయ నిర్మాణం చేసినట్టుగా కొన్ని చోట్ల చెప్పడుతూ ఉంటుంది… దేవాయలస్థలపురాణంలో వీటి గురించి చెబుతూ ఉంటారు.

దేవాలయాలు రహస్యాలు

స్థలపురాణం బట్టి ఆయా దేవాలయాలలో రహస్యములు ఉంటాయి. అవి ఆయా దేవాయల అర్చక స్వాముల వారి ద్వారానే తెలుసుకోవాలి…

ఎందుకు దేవాలయానికి వెళతారు?

ఇది మంచి ప్రశ్నగా పండితులు పరిగణిస్తారు. ఎందుకు దేవాలయానికి వెళుతున్నాను? అనే ప్రశ్న పలుమార్లు దేవాలయాలలో దైవదర్శనం జరిగాక వస్తే, అది మంచి మార్గమునకు దారితీస్తుంది… తత్వశోధనకు మనసులో బీజం పడుతుందని అంటారు. అయితే తాత్వికమైన దేవాలయ రహస్యంగా చెబుతారు.

సహజంగా భక్తులు దేవాలయానికి వెళ్లేది… మొక్కులు మొక్కడానికి లేదా మొక్కులు చెల్లించడానికి

కష్టం వచ్చినప్పుడు ఇష్టదైవమును లేక కులదైవమును తలచుకుని, ఆకష్టం తీరిస్తే, తిరిగినేను నీకు చెల్లింపులు చెల్తిస్తాను అని మొక్కుకుంటారు… అలా మొక్కుకుని మొక్కులు తీర్చే భక్తులు ఎక్కువగా దేవునికి ఇచ్చేది… తమ అందానికి కారణమైన కేశములను మొక్కులుగా దేవదేవునికి చెల్లిస్తారు.

ఇలా కష్టం వచ్చినప్పుడు కొందరు ఇంట్లోనే దైవానికి మొక్కుకుంటే, కొందరు దేవాలయానికి వెళ్ళి మొక్కుతారు… ఆపై కోరిక తీరాక దైవానికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి దేవాలయమునకు వెళతారు. ఆవిధంగా భక్తులు తమ దైవమను దర్శించుకోవడానికి దేవాలయములకు వెళుతుండడంతో, దేవాలయాలు నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి.

దైవభక్తి మనసుకు అంతర్లీనంగా ధైర్యాన్నిస్తుందని అంటారు. భరించలేని కష్టం కలిగినా మనిషి తట్టుకున్నాడంటే, నన్ను భరించవాడు ఒక్కడు నాపై ఉన్నాడనే నమ్మకమేనని అంటారు.

అలా కాలం భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేస్తూ ఉంటుంది.

దేవుని నిలయమైన దేవాలయంలో చాలా నియమాలు చెబుతారు… అందుకు కారణం కదిలే మనసు ఏకాగ్రతతో ఉండాలంటే, నియమాలే సాధన అంటారు. అలా సాధనకు మనసు త్వరగా అంగీకరించదు కాబట్టి నియమాల రూపంలో ఒక సాధనగా చేసి, దైవదర్శనం చేసుకుంటే మనసుకు మేలు అంటారు.

నియమం వలననే మనసు మనిషికి లొంగుతుందని అంటారు… ఏకాగ్రతతో ఉండే మనసుయొక్క బుద్ది వికసిస్తుందని అంటారు… అందుకే దేవాలయానికి వెళితే తగు నియమాలు తుచ తప్పకుండా పాటించమని చెబుతారు.

ధన్యవాదాలు – తెలుగు వ్యాసాలు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలుగురీడ్స్ హోమ్