అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి. మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి. గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు. ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది. మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది. భూమి, గాలి,… Continue reading అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం