చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం అవుతాయి… తెలుగులో వ్యాసం. చెప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో వాటిని గుడ్డిగా నమ్మడం కూడా అంతే తప్పు. సమాజంలో మనిషికి మనిషికి మద్య ఏర్పడే సంబంధాలలో మరొక మనిషి పాత్ర ఉంటుంది. అవి మొదట్లో ఉన్నట్టు భవిష్యత్తులో ఉండవు. కారణం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చెప్పుడు మాటలు విని, నమ్మడమే అవుతుంది. ఒక మనిషి ఇంకొక మనిషి ఏర్పడిన పరిచయం ప్రక్రుతి వలన కానీ మరొక మనిషి వలన కానీ జరుగుతుంది. అలా ఏర్పడిన కొన్ని సంబంధాలు ఎక్కువకాలం కొనసాగుతుంది. అలాంటి బంధాలలో కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు ఉంటాయి. కుటుంబ బాంధవ్యం ప్రకృతిపరంగా సహజంగా జరుగుతుంది. స్నేహ సంబంధం మనసును బట్టి, మనసు ఇష్టాయిష్టాలను బట్టి ఏర్పడుతూ ఉంటాయి. స్నేహం, కుటుంబ సంబంధం మనిషి మనసుకు బలంగా మారతాయి.  ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అలాంటి మానవ సంబంధాలు ఒక్కోసారి చెప్పుడు మాటలు వలన దెబ్బతినే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు సంబంధాలకు చేటు చేస్తాయి. అవి స్నేహ సంబంధం కావచ్చు. లేక కుటుంబ సంబంధం కావచ్చు. మనిషికి మాటల వలననే మంచి సంబంధాలు ఏర్పడుతాయి. అలాంటి మాటలను కొందరు మంచికి ఉపయోగిస్తే, కొందరు చెడుకు ఉపయోగించవచ్చు. కొందరు చెడు అలవాట్ల కోసం ఉపయోగించే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్ల కొరకు మాట్లాడే మాటలు చెప్పుడు మాటలుగా పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి మాటలు, వారి స్వార్ధం కొరకు మాత్రమే ఉంటూ, విన్నవారికి చేటును చేసే అవకాశం ఉంటుంది. మరికొందరికి చెడు గుణాలను కలిగి ఉండవచ్చు. మంచి సంబంధాలను చూసి ఓర్వలేని గుణం కలిగి, కొందరు సమాజంలో ఉండవచ్చు. ఇలాంటి వారి మాటలు మంచి సంబంధాలకు చేటును చేస్తాయి. ఇవే చెప్పుడు మాటలుగా సమాజంలో చెబుతారు. మౌనం మనిషిని మునిగా మారిస్తే, మాటలు మనిషిని మాటకారిగా మారిస్తే, మంచికి ఉపయోగిస్తే, వారి వలన వారి చుట్టూ ఉన్నవారికి శాంతి చేకూరుతుంది. కానీ మాటకారికి చెప్పుడు మాటలు చెప్పే స్వభావం ఉంటే మాత్రం, వారి చెప్పుడు మాటలకు సత్సంబంధం బలి అయ్యే అవకాశం ఉంటుంది. అదే మాటకారికి మంచి గురించి చెప్పే అలవాటు ఉంటే, … Read more