రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణం అంటే శ్రీరాముని పదహారు గుణాలను తెలుపుతూ ఉంటుంది. ఈశ్వరునికి ఉండే పదహారు విశిష్టమైన గుణాలు ఒక మానవుడికి ఉంటే, ఆయనే శ్రీరామచంద్రమూర్తిగా ప్రవచనకారులు చెబుతారు. ఇంకా శ్రీరాముడు పరమ ధర్మమూర్తిగా పురాణాలలో చెప్పబడతారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది… అనే ఆర్యోక్తి శ్రీ రామాయణంలో రాముని ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి, ఆ ప్రాంతవాసులకు ఆదర్శం అయితే, ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా కనబడును. అలాగే ఒక కుటుంబ పెద్ద కూడా సమాజంలో తగినంత అనుభవం కలిగి ఉంటాడు. కాబట్టి కుటుంబ పెద్ద అయినా తండ్రి తనయుడికి ఆదర్శప్రాయంగా నిలిస్తే, అతనిని అనుసరించడం తనయుడి ధర్మం. అటువంటి కర్తవ్య దీక్షనే శ్రీరామచంద్ర మూర్తి రామాయణంలో నిర్వహించినట్టుగా రామాయణం ద్వారా మనకు తెలియబడుతుంది. కేవలం తండ్రి మాటపై గురువుతో రాముడు అడవులలో నడిచాడు. అయోధ్యలో అంతపురంలో సౌకర్యవంతమైన జీవనం కలిగి ఉన్న శ్రీరాముడు, విశ్వామిత్రుడి వెంట అడవులలో నడిచాడు. శ్రీరాముడిని తనతో పంపవలసినదిగా, దశరడుని విశ్వామిత్రుడు కోరతాడు. అప్పుడు దశరదుడు శ్రీరాముడిని, విశ్వామిత్రుని వెంట పంపుతాడు… విశ్వామిత్రుడి చెప్పినట్టు శ్రీరాముడు అడవులలో నడుచుకుంటాడు. విశ్వామిత్రుడిని దగ్గర అనేక అస్త్ర, శస్త్రాలను శ్రీరాముడు పొందుతాడు… కానీ వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించకుండా కేవలం ధర్మరక్షణకై ఉపయోగించడం రామాయణంలో రాముడి దగ్గరే తెలుసుకోవాలని పెద్దలంటారు. ఎంతటి శక్తిని … Read more