తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం ఈ పోస్టులో రీడ్ చేయండి…

తెలుగు భాష తియ్యదనంతెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలదనం… తల్లితండ్రి నేర్పినట్టి మాతృ భాషరా… తెలుగు మరిచిపోతే, వాళ్ళని నువ్వు మరిచనట్టేరా… ఈ పాట నిజమే కదా…!

మన తెలుగు భాష మన అమ్మ దగ్గర నుండే మనకు మొదలు అవుతుంది. తెలుగువారమైన మనకు మన అమ్మ భాష తెలుగే ఉంటుంది… కాబట్టి అమ్మ దగ్గర నుండే తెలుగులో మాట్లడడం, తెలుగులో వినడం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు భాష మనకు మాతృభాష

ఎవరి అమ్మవారికే గొప్ప అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికే గొప్ప… కానీ తెలుగు భాషకు ప్రత్యేకత ఉంటుందని అంటారు. ఎప్పుడో చరిత్రలోనే రాజుల కాలంలోనే దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. వ్యాకరణం దీని ప్రత్యేకత… అది ఎంత ప్రత్యేకమో అంత సాధన కూడా అవసరం అంటారు… లేకపోతే తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం అంత సులువు కాదని అంటారు.

మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.

తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతిపదార్ధము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి.

అలాగే సామెతలు ఒక్క లైనులోనే ఉంటాయి…కానీ చాలా అర్ధవంతమైన భావమను వ్యంగ్యంగానూ, హాస్యంగానూ తెలియజేస్తాయి…

ఇంకా సూక్తులు కూడా కేవలం ఒక వ్యాక్యములోనే ఉంటాయి… కానీ భావము మాత్రము బలమైన అంతరార్ధమును కలిగి ఉంటాయి.

అంటే ఇలా పద్యాలు, సూక్తులు, సామెతలు గమనిస్తే, చాలా తక్కువ పదాలతో ఎక్కువ భావమును ఇముడ్చుకోవడంలో తెలుగు భాష గొప్పతనం కనబడుతుందని అంటారు.

దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వ్యాక్యాలతో ఉంటాయి… అవి కూడా మూడు వ్యాక్యాలు ఇంకా ఒక మకుట వ్యాక్యం కలిగి ఉంటాయి.

తెలుగు భాష గొప్పతనం అంతా బావప్రకటనలో, చాలా చిన్న చిన్న తేలికపాటి పదాలతో ఇమిడి ఉంటాయి. చిన్న చిన్న వ్యాక్యాలలోనే జీవిత పరమార్ధమును తెలియజేసే విధంగా ఉంటుంది.

స్వచ్ఛమైన మన తెలుగు భాష ఈనాటిది కాదు… మన మాతృభాష గొప్పతనం ఏనాడో పెద్దలు పుస్తకాల ద్వారా తెలియజేశారు…

తెలుగు భాషలో గొప్ప గొప్ప కవులు ఉన్నారు. గొప్ప గొప్ప ఇతిహాస, పురాణాలను అనువదించినవారు ఉన్నారు… అవి అన్ని కూడా సంస్కృత భాష నుండి తెలుగుకు తర్జుమా చేసినవే… తెలుగు భాషలో కవులకు లోటు లేదు పదాలకు లోటు లేదు…

మాతృభాష తెలుగు భాషలో పుస్తకం రీడ్ చేయడం

పుట్టిననాటి నుండి అలవాటు అయిన తెలుగులో ఏ పుస్తకం చదివినా అందులోని సారంశం సులువుగా మైండులోకి వెళుతుందని అంటారు. మాతృభాష తెలుగు భాషలో పుస్తకం రీడ్ చేయడం వలన విషయవిజ్ఙానం త్వరగా వృద్ది చెందే అవకాశం ఉంటుంది.

మన భాషలో మనకు మాట్లాడుతున్న నాటి నుండే పదాలకు అర్ధం తెలిసి ఉంటుంది. అమ్మ దగ్గర అలవాటు అయిన తెలుగు భాష, నాన్న బందుమిత్రుల ద్వారా అనేక మాటలకు అర్ధాలు తెలిసి ఉంటాయి. ఇక తెలుగు భాషలోని తెలుగు బుక్స్ రీడ్ చేయడం మొదలైతే, మరింత సులువుగా ఆ పుస్తక సారం అర్ధం అవుతుందని అంటారు.

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం లో కొద్ది పాటి వివరణ ఇవ్వడం జరిగింది…. తెలుగు భాష గొప్పతనం అంటే తెలుగు సాహిత్యం చదివితే, తెలుగు వెలుగు రుచి తెలుస్తుంది… అది స్వయంగా చదివితేనే దాని గొప్పతనం మనకు అనుభవంలోకి వస్తుంది… అంతవరకు విన్నట్టుగానూ, చదివినట్టుగానూ మాత్రమే తెలుగు భాష గొప్పతనం తెలియబడుతుంది.

ధన్యవాదాలు – తెలుగు వ్యాసాలు

తెలుగురీడ్స్ హోమ్