తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే, ఆచారంలో పండుగలు చాలా విశిష్టమైన పాత్రను పోషిస్తాయి.

అసలు పండుగ అనగానే ముందుగా మనసులో సంతోషం కలుగుతుంది. పండుగ అనగానే గుడికి వెళ్ళడం, ఇంట్లో దైవమునకు ప్రత్యేక పూజలు చేయడం, బంధువులను ఆహ్వానించడం మొదలైనవి ఉంటాయి.

సామూహికంగా జరిగే పండుగలు జాతరలుగా ఉంటాయి. కుటుంబపరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగేవి కొన్ని పండుగలు ఉంటాయి.

అయితే కొన్ని పండుగలకు సామూహికంగానూ, కుటుంబంలోనూ కూడా కార్యక్రమములు నిర్వహిస్తారు. కొన్ని పండుగలు కేవలం కుటుంబం వరకే పరిమితం అవుతాయి. కుటుంబంలో బంధువులతో కలిసి పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు.

ఈ పండుగలు వచ్చినప్పుడు ప్రధానంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కుటుంబ పెద్ద తన ధర్మపత్ని సమేతంగా కుటుంబ సంక్షేమం కోసం పూజలు జరుపుకుంటారు.

కుంటుంబంతో కలసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సంక్షేమం కోసం దైవాన్ని ప్రార్ధించడంలో కుటుంబ పెద్దకు ఒక విధివిధానం పండుగల రూపంలో ఉంటుంది.

కాలగమనంలో సంవత్సరంలో కొన్ని మాసాలలో వచ్చే కొన్ని తిధులు విశిష్టమైనవిగా ఉంటాయి. అటువంటి తిధులలో దైవమునకు పూజలు చేయడం వలన దైవకృప, ఆకుటుంబంపై ఉంటుందనే సంప్రదాయం ఆనాదిగా భారతదేశంలో ఉంది.

ఆ ప్రకారంగా పూర్వకాలంలో ఋషులు నిర్ధేశించిన తిధుల ప్రకారం మనకు ఒక సంవత్సరంలో పలు పండుగలు వస్తూ ఉంటాయి.

ఋషులు నిర్ధేశించిన కొన్ని తిధులు పండుగలు.

వినాయక చవితి బాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి తిధిని వినాయక చతుర్ధిగా జరుపుకుంటారు. అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమి తిధిని విజయదశమిగా జరుపుకుంటారు.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు అమావాస్య దీపావళి అమావాస్య.. ఆరోజు దీపాలన్నింటిని కొన్ని వరుసలుగా పెట్టి దీపాలను వెలిగించడం చేస్తూ ఉంటారు.

ఇలా కొన్ని ముఖ్య తిధులలో పండుగలు సనాతన సంప్రదాయంలో ఋషుల ద్వారా భారతదేశంలో ఆచారంగా జరుగుతూ ఉంటాయి.

భోగి, సంక్రాంతి, కనుమ, రధసప్తమి, మహాశివరాత్రి, శ్రీరామనవమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణ జన్మాష్టమి, వినాయక చతుర్ధి, విజయదశమి, అట్లతద్ది, దీపావళి, లక్ష్మీపూజ, సుబ్రహ్మణ్య షష్ఠి పండుగలు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు.

ఇవే కాకుండా ప్రత్యేక తిధులలో వ్యక్తి స్థితిని బట్టి వ్రతాలు చేయడం కూడా ఉంటుంది. ఇవి వ్యక్తిగత ఇష్టి ప్రకారం బ్రాహ్మణుల ద్వారా నిర్వహించుకుంటారు.

ఏకాదశి, శనిత్రయోదశి, ప్రదోష వ్రతం, సంకష్టహర చతుర్ధి, స్కంద షష్టి వంటి తిధులు మరియు నక్షత్రమును బట్టి బ్రాహ్మణుల సూచన మేరకు వ్యక్తిగతంగా నియమాలతో పూజలు నిర్వహిస్తారు.

సహజంగా అందరూ నిర్వహించుకునే పండుగలంటే సంక్రాంతి, మహాశివరాత్రి, వినాయక చవితి, శ్రీరామనవమి, దీపావళి వంటి మొదైలైన పండుగలు.

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

పండుగల ప్రాముఖ్యత, పండుగలలో నియమాలు

పండుగల ప్రాముఖ్యత చాలా బాగా వ్యక్తి మనసుపై ప్రభావం చూపుతాయి. కారణం అందులో నియమాలు మనిషికి మేలు చేసేవిగా ఉంటాయని పెద్దలు అంటారు.

ముఖ్యంగా ప్రాత:కాలంలో అంటే సూర్యోదయమునకు ముందే నిద్రలేవడం.

తలస్నానం చేయడం

దృఢసంకల్పంతో శ్రేయస్సుకొరకు సంకల్పం చేయడం

పూజ కొరకు పత్రులు తీసుకురావడం

కొత్త దుస్తులు ధరించడం

ఓపిక మేరకు బ్రాహ్మణులతో పూజలు చేయించడం లేకపోతే స్వయంగా పూజ చేసుకోవడం

అందరి క్షేమం కోరుతూ ప్రకృతిలో లభించే వివిధ పత్రులతో దైవాన్ని పూజించడం

పిండివంటలు

బంధువులను ఆహ్వానించడం

గుడికి వెళ్ళి దైవదర్శనం చేయడం మొదలైనవి ఉంటాయి.

ఇవి ఒక మనిషికి కొత్త ఉత్సాహం తెచ్చేవిగాను, శరీరానికి బలాన్ని అందించేవిగానూ ఉంటాయని అంటారు.

కొత్త బట్టలు కట్టుకోవడం మనసుకు సంతోషం. బంధు మిత్రులతో కలిసి పిండివంటలు తిని ఆరగించడం శరీరమునకు, మనసుకు కూడా ఆరోగ్యం. ప్రాత:కాల సమయంలో స్నానం మరీ మంచిది. పత్రితో దైవాన్ని పూజించడం వలన కూడా అందులోని ఔషధ గుణాలు మేలు చేస్తాయని అంటారు.

ఈ విధంగా పండుగలు మనిషి మనసు ప్రభావం చూపిస్తూ, మనిషిలో నూతనోత్తేజం కలిగిస్తాయని అంటారు. అందువలన సనాతన సంప్రదాయంలో ఋషుల ద్వారా అందించబడిన ఆచారంలో భాగం కాలక్రమంలో వచ్చే ముఖ్య తిధులలో పండుగలు నిర్వహించుకోవడం శ్రేయష్కరం అంటారు.

తెలుగు వ్యాసాలు

తెలుగురీడ్స్ హోమ్