తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట.

ఆ ఒక విషయమును విపులంగా వివరణతో విశ్లేషించబడి ఉంటుంది. వ్యాసం నందు మొదటిగా విషయము శీర్షిక ఉంటుంది. ఆపై ఉపోద్గాతము ఉంటుంది.

ఉపోద్గాతము తర్వాత వ్యాసంలో విషయమును గురించి వివరాలతో వివరిస్తూ సాగుతుంది. విషయము యొక్క విశిష్టత, విషయము యొక్క ఆవశ్యకత, విషయము యొక్క ప్రభావం, విషయము యొక్క లాభ నష్టాలు తదితర అంశముల వారీ విషయ విశ్లేషణ వ్యాసంలో వ్రాయబడి ఉంటుంది.

ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ గురించి వ్యాసం వ్రాయాలంటే… ముందుగా స్మార్ట్ ఫోన్ ఎవరు కనిపెట్టారు. ? ఎప్పుడు కనిపెట్టారు? ఎవరు డవలప్ చేశారు? అందులో పనిచేసే సాఫ్ట్ వేర్? వంటివి వ్రాయాలి.

విషయము యొక్క విశిష్టత: అంటే మొబైల్ ఉంది. దాని ప్రధాన ప్రయోజనం దానియందు విశిష్టమైనదిగా ఉంటుంది. ఒక సాదారణ కంప్యూటర్ ద్వారా నిర్వహించే పనులు స్మార్ట్ ఫోను ద్వారా కూడా చేయవచ్చును. ఈరోజులలో స్మార్ట్ ఫోనులు మల్టి టాస్కింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలా ఏదైనా వస్తువు యొక్క విశిష్టతను వివరించడం వ్యాసంలో ఉంటుంది.

ఆవశ్యకత: అంటే ఒక విషయము యొక్క ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో ఎంతవరకు ఉంది? అనే విషయం చెప్పడాన్ని ఆవశ్యకత అంటారు. అలా ఒక మొబైల్ ఫోన్ ఆవశ్యకత గురించి తెలియజేయాలంటే… స్మార్ట్ ఫోను ద్వారా ఆన్ లైన్ చెల్లింపు చేసేయవచ్చును. స్మార్ట్ ఫోను ద్వారా షాపింగ్ చేయవచ్చును. స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యనభ్యసించవచ్చును… నేడు స్మార్ట్ ఫోను మనిషి జీవితంలో ఒక బాగమై ఉంది. కావునా మొబైల్ ఫోన్ నేటి రోజులలో అందరికీ అవసరమే అవుతుంది.

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

ప్రభావం: ఒక విషయము ప్రస్తుత పరిస్థితలలో ఎలాంటి ప్రభావం సమాజం మీద చూపుతుంది? ఆ విషయము వలన సమాజంపై భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రభావం చూపవచ్చును..? ఇలాంటి ప్రశ్నలతో విషయ ప్రభావం ఎలా ఉంటుందో వివరించడం… ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే, అది వ్యక్తి జీవితంలో భాగమై ఉంది. ఎక్కడికి వెళ్ళినా వెంట స్మార్ట్ ఫోన్ ఉండాలి.

స్మార్ట్ ఫోను వలన అనే ఆన్ లైన్ లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చును. అయితే స్మార్ట్ ఫోనులో అంతర్జాలం ద్వారా వచ్చే అనేక మంచి చెడు విషయాలను చూపుతుంది. కాబట్టి యువత చెడువైపు ఆకర్షితమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. భవిష్యత్తులో అనేక మార్పులు సమాజంలో మొబైల్ ఫోను ద్వారా జరగవచ్చును… ఇలా ప్రభావం గురించి వివరించడం.. ఇంకా వివరంగా వ్యాసంలో వివరించవచ్చును.

వ్యాసం గురించి

లాభనష్టాలు: ఒక విషయముల వలన సమాజానికి ఒనగూరే పూర్తి ప్రయోజనాలు, పూర్తి నష్టాలు పాయింట్ల వారీ తెలియజేయడం.

 • మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చెల్లించవచ్చును
 • స్మార్ట్ ఫోను ద్వారా ఎవరైనా ఎక్కడినుండైనా ఎక్కడివారితోనైనా కమ్యూనికేట్ చేయవచ్చును.
 • ఇమెయిల్ సందేశాలు, మల్టీమీడియా సందేశాలు క్షణాలలో పంపించవచ్చును.
 • సృజనాత్మకతను బట్టి స్మార్ట్ ఫోను ద్వారా కూడా సంపాధన చేయవచ్చును.
 • ఏవైనా విషయాలు శోదించడానికి స్మార్ట్ ఫోను చాలా ఉపయోగం.

  నష్టాలు
 • స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగే కొలది,మనిషికి మనిషికి గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది.
 • రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది.
 • టచ్ స్క్రీనుపై అనేక క్రిములు ఉంటాయి.
 • యువతకు స్మార్ట్ ఫోన్ గేమింగ్ వంటివి వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
 • ఎక్కువగా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూడడం వలన కళ్ళపై ప్రభావం పడుతుంది.

ఇలా ఇక విషయమును గురించిన లాభనష్టాలు వ్యాసంలో చూపాలి. అవి సమాజంపై ఏవిధంగా ప్రభావం చూపుతూ మనిషిని ప్రభావితం చేస్తున్నాయి….

వ్యాసం ముఖ్యంగా ఒక విషయం గురించిన సమాచారం అందిస్తుంది. ఒక ఉపన్యాసము అక్షరరూపంలో మారితే వ్యాసం, అది వ్యాసము అవుతుంది.

ఉపన్యాసంలో కూడా విషయమను సమగ్రంగా విశ్లేషిస్తారు. అలాగే వ్యాసంలో కూడా ఒక విషయమును సమగ్రమంగా విశ్లేషిస్తారు.

తెలుగు వ్యాసాలు

తెలుగురీడ్స్ హోమ్